దిల్లీ వాయు కాలుష్యానికి వాళ్లే బాధ్యులు : ఆరోగ్య మంత్రి గోపాల్‌రాయ్‌

-

దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాతావరణంలో మాత్రం మార్పు లేదు. ఈ క్రమంలో దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి గోపాల్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాయు కాలుష్యానికి ప్రజలే బాధ్యులను అన్నారు. వీలైతే జనం ఇంటి నుంచే పని చేయాలని.. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. వాహనాల వల్లే 50 శాతం కాలుష్యం కలుగుతోందని చెప్పారు.

రెండ్రోజులుగా దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో కాలుష్యం స్థాయి పెరిగిందని గోపాల్ రాయ్ పేర్కొన్నారు. యూపీ, హర్యానాలో కూడా ఏక్యూఐ స్థాయి పెరిగిందని తెలిపారు. గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, నోయిడా వంటి దిల్లీకి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని యూపీ, హర్యానా ప్రభుత్వాలను కోరుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. దిల్లీలో ఇవాళ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ పూర్‌ కేటగిరిలో నమోదైంది. ఏక్యూఐ 354గా రికార్డవగా.. నోయిడాలో 406, గురుగ్రామ్‌లో 346గా రికార్డయింది.

Read more RELATED
Recommended to you

Latest news