ఉన్నావ్ రేప్ కేసులో ఎమ్మెల్యేని దోషిగా తేల్చిన ఢిల్లీ హైకోర్ట్…!

-

2017లో జరిగిన ఉన్నావ్ అత్యాచార కేసులో ఢిల్లీ హైకోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది… ఉన్నావ్ నుంచి నాలుగు సార్లు బిజెపి తరుపున ఎమ్మెల్యే అయిన… ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్ ని దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. 2017 జూన్ 4 న ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి పిలిచి మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేసారు. అప్పుడు ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు కూడా వచ్చాయి… ఈ కేసులో… శశి సింగ్ అనే వ్యక్తిపై అభియోగాలు నమోదు చేసారు… ఈ ఏడాది ఆగస్టు 9న ఎమ్మెల్యేపై కూడా అభియోగాలు నమోదు చేయడంతో,

ఆయన్ను అప్పుడు ఉత్తరప్రదేశ్ బిజెపి విభాగ౦ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది… నేరపూరిత కుట్ర (120బీ), కిడ్నాప్‌ (363), పెళ్లికి బలవంత పెట్టడం (366), అత్యాచారం (376) తదితర అంశాలతోపాటు లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే చట్టం(పోక్సో) కింద ఇద్దరిపై కేసులు నమోదు చేసారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. ఈ అభియోగాలు నమోదు కావడానికి పది రోజుల ముందు అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారుకి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె పిన్ని అత్త ఇద్దరు మరణించారు.

బాధితురాలి తండ్రిపై ఉత్తరప్రదేశ్‌లో హత్య కేసు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు కేసు నమోదు చేయగా ఆయన పోలీస్ స్టేషన్ లో గత ఏడాది మరణించారు. ఇక అక్కడి నుంచి కేసు విషయంలో సుప్రీం కోర్ట్ జోక్యం చేసుకుంది. లక్నో నుంచి కేసుని… ఢిల్లీ హైకోర్ట్ కి బదిలి చేసారు. ఆగస్ట్ ఆగస్ట్ 5 నుంచి ఢిల్లీ హైకోర్ట్ ఈ కేసులో రోజు వారి విచారణ చేపట్టింది. ఎమ్మెల్యే కి ఈ నెల 19 న ఢిల్లీ హైకోర్ట్ శిక్ష ఖరారు చేయనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news