సీఎం కేజ్రీవాల్ భార్యకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

-

సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్యకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసు కోర్టు ప్రొసీడింగ్స్ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోర్టు నోటీసులు ఇచ్చింది. మార్చి 28 వ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు లో జడ్జి కావేరి భావేజ ముందు జరిగిన లిక్కర్ కేసు విచారణ సందర్భంగంగా సిఎం కేజ్రీవాల్ తన అరెస్ట్ కు సంబంధించిన వాదనలు కోర్టుకు వినిపించారు. కేజ్రీవాల్ కోర్టు ముందు చెప్పిన విడియో, ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Delhi High Court notices to CM Kejriwal’s wife

కేజ్రీవాల్ కోర్టు విడియో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేశాయి ఆమ్ ఆద్మీ పార్టీ తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల సోషల్ మీడియా టీమ్స్. అలాగే… కేజ్రీవాల్ వీడియో పోస్టులను ట్విట్టర్ లో రిపోస్ట్ చేశారు సునీతా కేజ్రివాల్‌. దీంతో కోర్టు నిబంధనలకు విరుద్ధంగా కోర్టు ప్రొసీడింగ్స్ లోని కేజ్రీవాల్ వీడియోను రికార్డ్ చేయడమే కాకుండా సోషల్ మీడియాలో పోస్టు చేశారని డిల్లీ హైకోర్టు ను ఆశ్రయించారు అడ్వకేట్ వైభవ్ సింగ్. సోషల్ మీడియాలో ఉన్న వీడియోను ఆయా సంస్థలు తొలగించాలని ఢిల్లి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news