ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది రౌస్ అవెన్యూ కోర్టు. సిబిఐ కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్ట్ నిరాకరించింది. తనపై విచారణ పూర్తి అయిందని.. మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు కోర్టులో వాదనలు జరిగాయి.
అయితే బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సిబిఐ వాదనలతో కోర్టు ఏకీభవించింది. అతడి బెయిల్ పిటిషన్ ను కొట్టి వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణ ఇంకా పూర్తి కాలేదని.. ఈడి కూడా దర్యాప్తు చేస్తోందని, విచారణకు ఇంకా సమయం పడుతుందని సిబిఐ స్పష్టం చేసింది. దీంతో ఈ విచారణ ఏప్రిల్ 5వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.