పంద్రాగస్టు ముందు ఢిల్లీలో భారీ కుట్ర భగ్నం.. 55 తుపాకులు స్వాధీనం

-

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో దేశ రాజధానిలో ఉగ్ర దాడులు, హింసాత్మక ఘటనలు జరగొచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తం అయ్యారు ఢిల్లీ పోలీసులు. ఈ నేపథ్యంలోనే దిల్లీ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు స్పెషల్ బ్రాంచ్‌ పోలీసులు. ఈ తనిఖీల్లో భారీ కుట్రను భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు.

నలుగురు వ్యక్తు లను అరెస్టు చేసి వారి నుంచి 55 పిస్టోళ్లు, 50 లైవ్‌ బులెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అరెస్టయిన వ్యక్తు ల్లో ఒకరు దిల్లీ వాసి కాగా.. మిగతా వారు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు పోలీసులు. అలాగే ఎర్రకోట సహా పలు ప్రముఖ ప్రాంతాల్లో భద్రతను పెంచిన పోలీసులు… సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రోన్లు, బెలూన్లు వంటివి ఎగరవేయడం పై నిషేధం విధించారు ఢిల్లీ పోలీసులు. అనుమానం వచ్చిన వాళ్ళను అరెస్ట్ చేయాలని కూడా అధికారులు ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news