రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసు: బీజేపీ ఎంపీ బ్రీజ్ భూషణ్ కు ఢిల్లీ కోర్ట్ సమన్లు…

-

గత కొంతకాలం క్రిందట నుండి భారత మహిళా రెజ్లర్లు తమను బ్రీజ్ భూషణ్ లైంగికంగా వేధిస్తున్నాడని ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో బ్రీజ్ భూషణ్ పై ఢిల్లీ పోలీసులు ఒక ఛార్జ్ షీట్ ను ఫైల్ చేశారు. ఇంతకాలం తర్వాత ఈ ఛార్జ్ షీట్ ను పరిశీలించిన ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్ట్ ఎంపీ బ్రీజ్ భూషణ్ కు సమన్లు జారీ చేసింది. జులై 18వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఏ సమం లలో పేర్కొంది. ఇంకా బ్రీజ్ భూషణ్ సెక్రెటరీ కూడా బాధ్యత ఉందని కోర్ట్ నమ్ముతూ అతనికి సమన్లు జారీ చేసింది. దీనితో ఇన్ని రోజుల మహిళా రెజ్లర్ల నిరసనకు ఈ రోజు ఒక మంచి స్టెప్ పడిందని చెప్పాలి. అయితే ఏ ఛార్జ్ షీట్ లో ఏమి పొందుపరిచారు ? కోర్ట్ ఆ రోజు విచారణలో ఏమి తేల్చనుంది ? ఇందుకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా ? లాంటి పూర్తి వివరాలపై ఒక క్లారిటీ రావాలంటే మరో 10 రోజులు పాటు వెయిట్ చేయాల్సిందే.

ఇతనిపై ఈ కేసు కనుక రుజువు అయితే… బీజేపీకి తీవ్ర అవమానకరం అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news