Haircut: చెప్పినట్టు జట్టు కత్తిరించకుండా.. ఇష్టవచ్చినట్టు హేర్ కట్ చేసినందుకు ఓ హెయిర్ సెలూన్ యాజమాన్యం ఏకంగా రూ. 2 కోట్ల నష్టపరిహారం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. హెయిర్ ప్రోడక్ట్ మోడల్ ఆష్నా రాయ్. ఆమె పెద్ద పెద్ద ‘హెయిర్ కేర్ బ్రాండ్’ లకు మోడలింగ్ చేస్తోంది. అయితే.. న్యూఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకు హాజరు అయ్యే క్రమంలో ఆష్ణారాయ్ 2018 ఏప్రిల్ 12న హెయిర్ కటింగ్ కోసం ఐటీసీ మౌర్యలోని సెలూన్‌కు వెళ్లింది. అయితే ఆ మోడల్ చెప్పినట్టు కాకుండా .. ఆమె సూచనలు విరుద్ధంగా సెలూన్ సిబ్బంది హెయిర్ కట్ చేశారు.
తన జట్టును నాలుగు అంగుళాల మేరకు జుట్టు మాత్రమే కత్తిరించాలని చేపితే.. సిబ్బంది ఆమె మాట సరిగా వినకుండా కేవలం 4 నాలుగు అంగుళాల జుట్టు మాత్రమే ఉండేలా జుట్టునంతా కత్తిరించేశారు.
దీంతో ఆమె మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. దీంత ఆమెకు పరిహారంగా తిరిగి ఆ జుట్టును అందించే చికిత్సను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కానీ.. ఆమె ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగా జుట్టు శాశ్వతంగా దెబ్బ తింటుందని, తనకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని, హెయిర్ కట్ చేయడంతో.. ఆఫర్లన్నీ పోయాయి. తన లైఫ్ స్టైల్ పూర్తికా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. టాప్ మోడల్ కావాలనే లక్ష్యం నేరవేర్చుకోలేకపోయానని బాధితురాలు ఎన్‌సీడీఆర్‌సీ ని ఆశ్రయించింది. సదరు హెయిర్ సెలూన్‌పై ఫిర్యాదు చేసింది. తనకు రూ. 3 కోట్ల నష్ట పరిహారం ఇప్పించాలని కోరింది
ఆష్నా రాయ్ ఫిర్యాదును పరిశీలించిన కోర్టు.. సెలూన్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఆష్నా జుట్టు నష్టపోయిందని నిర్ధారించింది. ఆ మోడల్ కు రూ. 2 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని సెలూన్ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ మొత్తం సోమ్మును 8 వారాలలోగా బాధితురాలికి అందజేయాలని ఆదేశించింది.