రాహుల్ గాంధీ ఎఫెక్ట్.. పాకెట్ రాజ్యాంగానికి ఫుల్ డిమాండ్

-

దాదాపుగా ఇరవై సెంటీమీటర్ల పొడవు, తొమ్మిది సెంటీమీటర్ల వెడల్పుతో లెదర్‌ బైండింగు చేసిన పాకెట్​ రాజ్యాంగ ప్రతులు (పాకెట్ రాజ్యాంగం)కు  ప్రస్తుతం డిమాండు పెరిగింది. ఒక మోస్తరుగా జేబులో పట్టేటంత సైజులో ఉండే ఈ పుస్తకాన్ని ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ర్యాలీల్లో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పలుచోట్ల పదే పదే ప్రదర్శించడం వల్ల ప్రజల్లో ఈ ఎడిషన్​పై ఆసక్తి పెరిగింది. దీంతో ఈ పాకెట్ రాజ్యాంగం ఎడిషన్ కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.

ఈ పాకెట్ రాజ్యాంగ పుస్తకాలను ఉత్తర్​ప్రదేశ్​లోని లక్నోలో ప్రచురిస్తారు. నగరంలో సుమారు 80 ఏళ్ల చరిత్ర గల ‘ఈస్టర్న్‌ బుక్‌ కంపెనీ’ (ఈబీసీ) ప్రచురణ కర్తలు గత పదిహేనేళ్లుగా ఈ పాకెట్‌ సైజు రాజ్యాంగ ప్రతులను ప్రచురిస్తున్నారు. లోక్​సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ విస్తృతంగా తీసుకెళ్లడం వల్లే ప్రజల్లో ఆసక్తి పెరిగిందని ఈబీసీ ప్రచురణ సంస్థ డైరెక్టరు సుమీత్‌ మాలిక్‌  తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి ఇప్పుడు ఈ పాకెట్ ఎడిషన్​ కోసం ఆర్డర్లు వస్తున్నాయని వెల్లడించారు. ఈ సైజు రాజ్యాంగ ప్రతుల ప్రచురణకు మొదట సుప్రీంకోర్టు న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌ తమను ప్రోత్సహించినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news