Breaking: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సోనియాగాంధీ ఫోన్

-

Sonia Gandhi phoned MLC Jeevan Reddy: ఢిల్లీ నుండి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాల్ వచ్చింది. జీవన్‌రెడ్డి‌కి సోనియా గాంధీ ఫోన్ చేశారట. వెంటనే ఢిల్లీ రావాల్సిందిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఏఐసీసీ నుండి పిలుపు వచ్చింది. జీవన్ రెడ్డిని ఢిల్లీకి తీసుకురావాల్సిందిగా విప్అడ్లూరి లక్ష్మణ్ ని ఆదేశించారు కాంగ్రెస్ పెద్దలు.

Sonia Gandhi phoned MLC Jeevan Reddy

దింతో కాసేపట్లో డిల్లీకి జీవన్ రెడ్డి… వెళ్లనున్నారు. విప్అడ్లూరి లక్ష్మణ్ కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక అంతకు ముందు కాంగ్రెస్ వైఖరిపై కంటతడి పెట్టుకున్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ మానిఫెస్టోలో ఎమ్మెల్యే పార్టీ మారితే సభ్యత్వం రద్దు చేస్తామని పెట్టి, ఇప్పుడు పార్టీలో ఎలా చేర్చుకుంటారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమోషనల్‌అయ్యారు. ఇన్నేండ్లు ఎవరి మీద కొట్లాడానో వారినే నాకు మాట కూడా చెప్పకుండా చేర్చుకున్నారు…నా భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news