రాజస్థాన్ లో ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. రాజస్థాన్ లో పరిస్థితి చక్కబడింది అని భావించారు గాని అనూహ్యంగా మళ్ళీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ షాక్ ఇచ్చారు. రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ పార్టీ హైకమాండ్‌తో ఎలాంటి చర్చలు జరగడం లేదని, దాని ముందు తాను ఎటువంటి షరతులు ఉంచలేదని చెప్పారు.
పైలట్ క్యాంప్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు కేవలం 84 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని, మిగిలిన వారు తమ వద్ద ఉన్నారని పేర్కొన్నారు. దీనితో ప్రభుత్వం దాదాపుగా కూలిపోయే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. సిఎం అశోక్ గెహ్లాట్ అయితే తమకు 110 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని స్పష్టం చేసారు.