ఏపీ రైతులకు శుభవార్త.. ధాన్యం కొనుగోలుకు కొత్త విధానం

-

ఏపీ రైతులకు శుభవార్త.. ధాన్యం కొనుగోలుకు కొత్త విధానానికి రూపకల్పన చేస్తామని ప్రకటించారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇవాళ మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ…ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నారు….వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించేందుకు శ్వేత పత్రాలను విడుదల చేస్తున్నారని వెల్లడించారు.

Designing a new system for procurement of grain

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధాని లేకుండా జగన్ చేశారు… సచివాలయాన్ని నిర్లక్ష్యం చేసి పాలన సాగించారన్నారు. అమరావతి ప్రాంతాన్ని బీడుగా మార్చారని మండిపడ్డారు. వచ్చే రెండేళ్లలో అద్భుతమైన రాజధానిని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ఇచ్చేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారు.. జంగిల్ క్లియరెన్స్ కే రూ.36 కోట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెచ్చిస్తున్నారన్నారు. వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల నుంచి మూడు నెలల క్రితం ధాన్యాన్ని కొనుగోలు చేసి వారికి డబ్బులు ఇవ్వలేదు…రైతులు ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకునేందుకు నాబార్డు ద్వారా ఈ నిధులను తీసుకుని ఇస్తున్నామని తెలిపారు. మోసపోయిన రైతులను ఆదుకుంటున్నాం… ధాన్యం కొనుగోలుకు కొత్త విధానానికి రూపకల్పన చేస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news