రాయుడు హత్య కేసులో అరెస్టు అయిన వారికి బిగ్ షాక్ తగిలింది. రాయుడు హత్య కేసులో అరెస్టు అయిన జనసేన ఇన్ చార్జ్ వినుత, అమె భర్త చంద్రబాబు, శివకుమార్, గోపి సహా మొత్తం ఐదుగురుకి 14 రోజుల రిమాండ్ విధించింది జార్జ్ టౌన్ కోర్డు.

కాగా శ్రీకాళహస్తి రాయుడు హత్య కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు చెన్నై పోలీసులు. గోపి, భాషా, శివ కూమార్ ,కోటా వినూత,కోట చంద్రబాబు లను ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హత్య చేసింది శివ కూమార్ గా గుర్తించారు. ఎర్పేడు సమీపంలో హత్య చేసి మృతదేహాన్ని నదిలో పడేసినట్లు గుర్తించారు పోలీసులు.