దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత మరింత క్షీణించింది. దీపావళి సందర్భంగా అక్కడి ప్రజలు బాణాసంచా కాల్చడంతో కాలుష్యం మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో క్రాకర్స్ అమ్మడం, కాల్చడం బ్యాన్ విధించినప్పటికీ ఢిల్లీ సరిహద్దులను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో పెద్దఎత్తున క్రాకర్స్ కాల్చడంతో ఈపరిస్థితి నెలకొన్నట్లు సమాచారం.దట్టమైన పొగ మొత్తం కమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఫలితం రహదారులు కనిపించడం లేదని సమాచారం.
విషపూరితమైన గాలి వలన ఢిల్లీ ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఢిల్లీ ప్రస్తుతం గ్యాస్ ఛాంబర్లా మారింది. ఉదయం 5.30 గంటలకు అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)700 కంటే ఎక్కువగా నమోదైంది. ఇక ఆనంద్ విహార్లో- 714, సిరిఫోర్ట్ -480, గురుగ్రామ్ -185, డిఫెన్స్ కాలనీ -631, నోయిడా -332, షహదర -183, నజాఫ్ ఘర్ -282, పట్పర్గంజ్ -513 పాయింట్లకు గాలినాణ్యత పడిపోయింది. దీపావళికి ముందు 400పైగా ఉన్న ఏక్యూఐ ఇప్పుడు 700 దాటడంతో శ్వాసకోశ సమస్యలున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.