దేవరగట్టు కర్రల సమరంలో భీబ‌త్సం…100మందికి గాయాలు..!

-

క‌ర్నూల్ జిల్లా దేవ‌ర‌గ‌ట్టు మాళ‌మ‌ల్లేశ్వ‌ర‌స్వామి క‌ర్ర‌ల స‌మరంలో దారుణం చోటు చేసుకుంది. ద‌స‌రా పండుగ సంధ‌ర్భంగా నిన్న రాత్రి క‌ర్ర‌ల స‌మ‌రం మొద‌లైంది. నిన్న రాత్రి బ‌న్ని జైత్ర‌యాత్ర ప్రారంభం అయ్యిన త‌ర‌వాత ఉత్స‌వ మూర్తుల‌ను ద‌ర్శించుకోవ‌డం కోసం నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు, అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల భ‌క్తులు మ‌రోవైపు ఇలా రెండు వ‌ర్గాలుగా విడిపోయారు.

అనంత‌రం ద‌ర్శ‌నం కోసం త‌ల‌ప‌డ‌టంతో హింస చెల‌రేగింది. ఈ స‌మరంలో ఏకంగా 100మంది వ‌ర‌కూ గాయ‌ప‌డ‌గా తొమ్మిది మంది ప‌రిస్థితి విషమంగా ఉంది. దేవ‌ర‌గ‌ట్టు క‌ర్ర‌ల సామ‌రం ఆచారం గ‌త కొన్నేళ్లుగా వ‌స్తోంది. ప్ర‌తియేటా ఇదే విధంగా గ్రామాలు రెండు గ్రూపులుగా విడిపోయి ద‌ర్శ‌నం కోసం క‌ర్ర‌ల‌తో త‌ప‌డుతుంటారు. ఈ క్రమంలో తీవ్ర‌గాయాల‌తో ఆస్ప‌త్రుల్లో చేరుతుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news