ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ.. తెలుగుదేశం నేతలు తెగ సవాళ్లు విసిరేస్తున్నారు. దానిపై అధికారపార్టీ మంత్రులు స్పందించే సరికి మౌనాన్నే తమ బాషగా చేసుకుని, ఆ టాపిక్ పై నాలుగు రోజులు సైలంట్ అయిపోయి.. మళ్లీ కొత్త సవాళ్ విసిరుతున్నారు. ఈ విషయంఓ రెండో ఆలోచ్నల లేకుండా, జనాలు ఏమనుకుంటారనే కనీస ఆలోచన లేకుండా ముందుకు వెళ్తున్నారు దేవినేని ఉమ! ముఖ్యమంత్రి, మంత్రులపై సవాల్లు అయిపోయాయో లేక అది రోటీన్ గా అనిపించిందో ఏమో కానీ… ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కి సవాల్ విసిరారు దేవినేని ఉమ!
పొలోమని సవాల్ విసరడం.. అనంతరం సైలంట్ అయిపోవడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిపోయింది అని కామెంట్లు వినిపిస్తున్న ఈ క్రమంలో… సజ్జల రామకృష్ణారెడ్డికి, టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ సవాల్ విసిరారు. వైసీపీ మేనిఫెస్టోపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా? అని టీడీపీ నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. మాట తప్పి.. మడమ అష్ట వంకర్లు తిప్పారని ఎద్దేవాచేసిన ఆయన… పోలవరం సమాచారాన్ని ఆన్ లైన్ లో ఎందుకు పెట్టడంలేదని నిలదీశారు. దీంతో… ఈ విషయాలపై సజ్జల స్పందించాల్సి ఉంది.
ఆ సంగతి అలా ఉంటే… కొన్ని రోజుల క్రిందట ఇదే పోలవరంపై దేవినేని ఉమ స్పందిస్తూ… టీడీపీ ప్రభుత్వ హయాంలో 90శాతం పనులు పూర్తిచేశామని, మిగిలిన 10శాతం పనులు ఈ ఏడాదిలో పూర్తిచేయలేకపోయారని విమర్శించారు. “పోలవరం పూర్తి చేసి తీరుతాం.. రాసుకో జగన్” అని శాసనసభ సాక్షిగా చెప్పిన మాటను గాలికి వదిలేసిన ఉమ.. 90శాతం పనులు పూర్తయిపోయాయని చెప్పుకొచ్చారు. ఈ విషయలపై సీరియస్ గా స్పందించిన మంత్రి అనీల్ కుమార్… నిజంగా పోలవరం పనులు 90శాతం పూర్తిచేశామని నిరూపిస్తే తాను మీసం తీసేసి తిరుగుతానని, అలాకానిపక్షంలో దేవినేని ఉమ మీసం తీసేసి తిరగాలని సవాల్ విసిరారు.
దీంతో ఉమ సైలంట్ అయిపోయి.. ఆ టాపిక్కే ఎత్తడం కానీ, అనీల్ ని కదపడం కానీ చేయలేదు. అనంతరం మళ్లీ ఇప్పుడు సజ్జలపై పోలవరం పేరుచెప్పి సవాల్ విసిరారు ఉమ! మరి ఈ వ్యవహారంపై ప్రభుత్వం నుంచి కానీ, సజ్జల నుంచి కానీ ప్రతి సవాల్ వస్తే గనక ఉమ్మ స్పందిస్తారా.. మళ్లీ తప్పించుకు తిరుగుతూ సైలంట్ అయిపోతారా అనేది వేచి చూడాలి!!