దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో ఉన్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు అన్నారు. ఆర్ధిక ప్యాకేజి ప్రవేశ పెట్టిన తర్వాతః ఆయన తొలిసారి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు ఆర్ధిక వ్యవస్థపై చేసారు. దేశం లో అన్ లాక్ మొదటి దశ ప్రారంభం అయిందని రెండో దశ త్వరలోనే మొదలవుతుంది అని వారం రోజుల్లో దాన్ని మొదలుపెడతామని మోడీ చెప్పారు.
ప్రస్తుతం ఆర్ధిక సవాళ్లు అనేవి తాత్కాలికమే అని మోడీ అన్నారు. మళ్ళీ వృద్ది రేటు పుంజుకుంటు౦దని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. భారత ఆర్ధిక వ్యవస్థ పరుగులు పెడుతుందని అన్నారు. ఆర్ధిక సంస్కరణల తో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని మోడీ అన్నారు. అదే విధంగా దేశ ప్రజలను కాపాడుకుంటూ నే ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని మోడీ పేర్కొన్నారు.
దేశ సాంకేతిక పరిజ్ఞానం పై తనకు నమ్మకం ఉందని అన్నారు. ఉపాధి అవకాశాలను పెంచడానికి తాము సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 53 వేల కోట్లను దేశ ప్రజల కోసం తాము ఖర్చు చేసామని చెప్పుకొచ్చారు. వివిధ రంగాల్లో వినూత్న ఆలోచనల ద్వారా సంస్కరణలు తీసుకొస్తున్నామని, ఈ ట్రేడింగ్ ద్వారా రైతులు పంటలను అమ్ముకునే అవకాశం ఉందని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.