తొడలు కొట్టి, ఛాలెంజ్ లు చేసినవారు ఇప్పుడేం చెబుతారో ? 

-

వైసీపీ ప్రభుత్వం పోలవరంలో 0.63 శాతం పనులే చేసిందని మాజీ జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు టీడీపీ హాయాంలోనే 70.83 శాతం పూర్తయినట్లు కేంద్రమే చెప్పిందన్న ఆయన విజయసాయి రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జల శక్తి మంత్రి సమాధానంచెబుతూ, 19 మే 2019 నాటికి ప్రాజెక్ట్ 70.83శాతం పూర్తయినట్టు చెప్పారని అన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక పోలవరంలో 0.63 శాతం పని మాత్రమే చేసిందని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం 70 శాతంపైగా పనులు చేస్తే, అడ్డగోలుగా అవినీతి ఆరోపణలు చేసి, అభాసుపాలయ్యారని ఆయన అన్నారు.

రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టులను పడుకోబెట్టి, కమీషన్ల కక్కుర్తితో పనులకు మంగళం పాడారని ఆయన విమర్శించారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని కేంద్ర  టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రూ.55,548కోట్లుగా నిర్ధారిస్తే, ఇప్పుడు రూ.47,725కోట్లని ఎలా చెబుతారు?  ఆయన ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ కి ఖర్చుచేసిన రూ.5 వేల కోట్లను కూడా కేంద్రం నుంచి తెచ్చుకోలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వముందని ఆయన అన్నారు. గోదావరి నుంచి నాగార్జనసాగర్ కు నీళ్లు పారించలేని వారు, సిగ్గులేకుండా గోదావరి – కావేరి గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. టీడీపీ హాయాంలోనే పోలవరంలో గేట్ల బిగింపు పనులు ప్రారంభమైతే, సిగ్గులేకుండా నవంబర్ -2020 నాటికి గేట్లు పెడతామని చెప్పుకుంటున్నారని అన్నారు. పోలవరం, పట్టిసీమల్లో అవినీతి జరిగిందనడానికి తమవద్ద ఎలాంటి ఆధారాలు లేవని కేంద్రం స్పష్టం చేసిందన్న ఆయన తొడలుకొట్టి, ఛాలెంజ్ లు చేసినవారు ఇప్పుడేం చెబుతారో చూడాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news