భావన పాడు పోర్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ గా టాటా కన్సల్టింగ్ ఇంజినీరింగ్ లిమిటెడ్, ఇన్రోస్ లాక్నర్ కన్సార్టియంను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ని నియమించేందుకు ఏపీ మారిటైమ్ బోర్డ్ కు అనుమతి జారీ చేసింది. 33.22 కోట్ల రూపాయలతో కన్సల్టెన్సీ బాధ్యతలు కు కొట్ చేసింది సదరు సంస్థ. బిడ్ లో టాటా కన్సల్టింగ్ తో పోటీ పడ్డాయి మరో మూడు కంపెనీలు.
ఇప్పటికే మొదటి విడుతగా 3669.95 కోట్ల రూపాయల అంచనాలతో 36 నెలల్లో పోర్ట్ నిర్మాణం చేసేలా డీపీఆర్ సిద్దం చేసింది రైట్స్ సంస్థ. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్ త్వరలోనే మరికొన్ని పోర్ట్ ల విషయంలో కూడా ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.