ఇండిగోకు వార్నింగ్ ఇచ్చిన డీజీసీఏ.. ఎందుకంటే?

-

బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ ఈ నెల 9న చండీగఢ్ నుంచి ముంబైకి విమానంలో ప్రయాణించిన సంగతి తెలిసిందే. అయితే అలా ఆమె ప్రయాణం చేసే సమయంలో ఆమెను ఫోటోలు, వీడియోలు తీశారు. అయితే ఈ విషయంపై (డీజీసీఏ) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థను వివరణ కోరింది.

దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ డీజీసీఏకు వివరణ కూడా ఇచ్చింది. అయితే ఇండిగో ఎయిర్‌లైన్స్ కెప్టెన్, క్యాబిన్ సిబ్బంది సంబంధిత నిబంధనలు అనుసరించినట్లు పేర్కొంది. కాగా కరోనా నేపథ్యంలో ప్రయాణికులు భౌతిక దూరం పాటించడంతో పాటు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఆంక్షలపై స్పష్టమైన ప్రకటనలు జారీ చేశారని అయినా మీడియా సిబ్బంది, మరికొందరు ప్రయాణికులు ఈ నిబంధనలను ఉల్లంఘించినట్టు వారు తెలిపారు.

ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకున్న డీజీసీఏ ఎయిర్ లైన్స్ ఈ అంశాలపై హెచ్చరిక జారీ చేసింది. భవిష్యత్ లో ఇదే తరహా నిబంధనలు ఉల్లంగిస్తే సంబంధిత రూట్ లో రెండు వారాల పాటు పర్మిషన్ నిలిపివేస్తాం అని హెచ్చరించారు. అంతేకాదు నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని వారు తెలిపారు. ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 1937 లోని రూల్ 13 ప్రకారం ఎయిర్ క్రాఫ్ట్ లో ‘ఏరో డ్రోమ్’లో ఫోటోలు తీయటానికి అనుమతించినట్టు అయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news