ధనుష్ “కెప్టెన్ మిల్లర్” నుండి బిగ్ అప్డేట్…

-

తమిళ మరియు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో ధనుష్.. తన నటనతో స్టైల్ తో యావరేజ్ సినిమాలను కూడా హిట్ చేసుకునేంత టాలెంట్ ఉంది ఇతనికి. ధనుష్ నుండి ఇటీవల వచ్చిన సార్ సినిమా తెలుగు మరియు తమిళ భాషలలో బిగ్ హిట్ అయింది. దీనితో ధనుష్ నెక్స్ట్ సినిమాలపైన ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇక ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కెప్టెన్ మిల్లర్ నుండి ఒక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు పోస్టర్స్ మినహా ఏ విధమైన అప్డేట్ వచ్చింది లేదు. ఈనెల 30వ తేదీన ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి ముహూర్తం పెట్టారు.

 

ఈ సినిమాలో ధనుష్ తో పాటుగా సందీప్ కిషన్ మరియు శివరాజ్ కుమార్ లు సైతం నటిస్తున్నారు. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా అరుణ్ మతేశ్వరన్ తెరకెక్కిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news