భారత్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ స్కీం ద్వారా ఆర్మీ అంటే ఆసక్తి ఉన్న ఎందరో యువతీ యువకులు దేశ సేవకోసం జాయిన్ అయ్యారు. తాజాగా సినీ నటుడు మరియు ఎంపీ అయిన రవి కిషన్ కూతురు కూడా ఆర్మీలో జాయిన్ అయింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరిలాగే ఈమె కూడా అగ్నిపధ్ స్కీం లో భాగంగా ఆర్మీ లో చేరింది. ఈ రోజుకు ఇషితా ఆర్మీ ట్రైనింగ్ ను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇషితా ఇప్పుడు భారతదేశాన్ని కాపాడే ఒక సైనికురాలిగా పదవిని అందుకుంది. ఈ విషయంపై ఉత్తరప్రదేశ్ మంత్రి దినేష్ కతిక్ స్పందించారు. ఈయన మాట్లాడుతూ ఇషితా సాధించిన ఈ ఘనత ఎందరో యువతీ యువకులకు ఆదర్శం అని కొనియాడారు.
ఈమె భవిష్యతులో అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఆశీర్వదించారు మంత్రి. మంత్రి చేసిన ఈ ట్వీట్ కు ఇషిత నాన్న రవి కిషన్ దేశ జెండాను రిప్లై గా పంపించారు.