ఢీ సీక్వెల్ వచ్చేస్తోంది..

మంచు విష్ణు కెరీర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ఢీ. ఈ సినిమాతో శ్రీనువైట్ల ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. బ్రహ్మానందం కామెడీతో ప్రేక్షకులని పొట్టచెక్కలయ్యేలా చేసిన ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందటూ చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఢీ సినిమా సీక్వెల్ కి నేను రెడీ ఉన్నానంటూ చాలాకాలంగా మంచు విష్ణు చెబుతూనే ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం ఢీ సీక్వెల్ రెడీ కాబోతుంది.

ఈ మేరకు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించాడు. ఐతే సీక్వెల్ అని చెప్పబడుతున్న ఈ సినిమా, సెపరేట్ కథాంశంతో సాగనుందట. ఢీ చిత్రానికి సీక్వెల్ కి ఎలాంటి సంబంధం ఉండదట. కేవలం శ్రీనువైట్ల, మంచు విష్ణు కలిసి పనిచేస్తున్నారంతే. ఐతే కథాంశం ఏదైనా ఢీ అని పేరు పెట్టినపుడు ఆ సినిమా మాదిరి కామెడీని ప్రేక్షకులు కోరుకుంటారు. మరి ఈ విషయంలో దర్శక హీరోలు ఏం చేస్తారో చూడాలి. ఢీ సీక్వెల్ ప్రకటన 23వ తేదీన రివీల్ చేస్తారట.