స్పీడ్ పెంచిన తమన్‌..నాలుగు భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు

-

అల వైకుంఠపురంలో వంటి బ్లాక్‌బస్టర్‌తో తమన్‌ స్టాయి పెరిగినా.. కేవలం పెద్ద హీరోల సినిమాలే కాకుండా.. యంగ్ హీరోలతో వర్క్‌ చేస్తున్నాడు . పవన్‌… ఎన్టీఆర్‌.. మహేశ్ వంటి స్టార్స్‌తో పాటు.. నాని.. సాయిధరమ్‌ తేజ్‌ వంటి యంగ్‌ హీరోలతో పనిచేస్తున్నారు. తెలుగుతోపాటు.. తమిళం.. హిందీ… మలయాళ మూవీస్ కూడా తమన్‌ చేతిలో వున్నాయి. బిజీయెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ చేతిలో ఇప్పుడు పదుల సంఖ్యలో సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది.

తమన్‌ కెరీర్‌ అలవైకుంఠపురంలోకు ముందు.. ఆతర్వాత అని డివైడ్‌ చేసేశారు. ఈ మ్యూజికల్‌ బ్లాక్‌బస్టర్‌తో తమన్‌కు క్రేజ్‌ పెరగడమే కాదు.. స్థాయి పెరిగింది. అల వైకుంఠపురంలో హిందీ ఆఫర్‌ తీసుకొచ్చింది. అక్షయ్‌కుమార్‌ సినిమా ‘సూర్యవంశీ’కి బ్యాక్‌గ్రౌడ్‌ మ్యూజిక్‌ ఇస్తున్నాడు తమన్‌. అల వైకుంఠపురంలో సాంగ్స్‌కు ఇంప్రెస్ అయిన మహేశ్‌ తమన్‌కు మరో ఛాన్స్‌ ఇచ్చాడు. బిజినెస్‌మేన్‌.. దూకుడు .. ఆగడు తర్వాత ఈ ఇద్దరి కాంబోలో ‘సర్కారువారి పాట’ వస్తోంది.

స్టార్స్‌ అందరితో వర్క్‌ చేయాలని ప్రతి మ్యూజిక్‌ డైరెక్టర్‌కూ వుంటుంది. పవన్‌ మూవీ చేసే అవకాశం వకీల్‌సాబ్‌తో వచ్చింది. ఇక బాలకృష్ణ, బోయపాటి సినిమాకు కూడా తమనే మ్యూజిక్‌ డైరెక్టర్‌. డిక్టేటర్‌ మూవీకి తమన్‌ మ్యూజిక్‌ అందించగా.. ఇది రెండో సినిమా. బోయపాటి బన్నీతో తీసిన రేసుగుర్రంకు తమన్‌ స్వరాలు ఇచ్చాడు. ఇలా… కలిసొచ్చిన తమన్నే ఎంచుకున్నాడు.

అరవింద సమేత వీర రాఘవ.. అల వైకుంఠపురంలో హిట్స్‌ తర్వాత తమన్‌ త్రివిక్రమ్‌ ఆస్థాన సంగీత దర్శకుడు అయిపోయాడు. త్వరలో తారక్‌తో తీయబోయే మూవీ కోసం తమన్‌నే ఎంచుకున్నాడు. ఈ ఛాన్స్‌ తమన్‌కు పెద్ద పరీక్షే. అల వైకుంఠపురంలో కు మించిన పాటలను ఆడియన్స్‌ ఆశిస్తారు. మరి వీళ్ల అంచనాలను తమన్‌ అందుకుంటాడో లేదో చూడాలి.

పెద్ద హీరోలే కాదు.. యంగ్ హీరోలకూ తమనే కావాలి. ప్రతిరోజుపండగే తర్వాత సాయిధరమ్‌ నటిస్తున్న ‘సోలో బతుకే సో బెటర్‌’ మూవీకి తమన్‌ పని చేస్తున్నాడు. తేజూకు తమన్‌ బాగా క్లోజ్‌ కావడంతో… మరోసారి ఈ టాలెంటెడ్‌ మ్యూజిక్‌డైరెక్టర్‌నే రికమెండ్‌ చేశాడు. అలాగే వరుణ్‌తేజ్‌ సినిమాకు.. నాని ‘టక్‌ జగదీశ్‌’ మూవీకి తమన్‌ మ్యూజిక్‌ ఇచ్చే పనిలో బిజీగా వున్నాడు.

కెరీర్‌ మొదట్లో తమన్‌.. రవితేజ వరుస సినిమాలకు వర్క్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబోలో ‘క్రాక్‌’ మూవీ రూపొందుతోంది. అలాగే.. తమిళంలో విజయ్‌ నటించే 65 సినిమాకు తమన్‌ స్వరాలు అందిస్తున్నాడు. ఇన్ని సినిమాలకు.. ఇంతమంది స్టార్స్‌కు.. ఒకేసారి మ్యూజిక్‌ ఇవ్వడం కష్టమే అయినా.. లాక్డౌన్‌ తమన్‌కు కలిసొచ్చి.. కరోనా సెలవుల్లోనే .. ట్యూన్స్‌ అన్నింటినీ ఇచ్చేశాడు. ఇక సినిమా పూర్తికాగానే.. బ్యాక్‌గ్రౌండ్‌ ఇస్తే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news