గెలిస్తే ధోనీ.. ఓడితే గైక్వాడా? ..మండిపడుతున్న నెటిజన్స్

-

నిన్న 210 పరుగులు చేసినా చెన్నై ఓడిపోవడం సరికొత్త చర్చకు దారి తీసింది. చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే ధోనీకి క్రెడిట్ ఇచ్చే ఫ్యాన్స్.. ఓడితే మాత్రం రుతురాజ్ను విమర్శిస్తున్నారని నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ధోనీ ప్రస్తుతం సారథిగా లేకపోయినా కీలకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే ధోనీ వ్యూహాలతోనే సాధ్యమైందని పొగిడినప్పుడు.. ఓడినప్పుడూ అతడినే బాధ్యుడిని చేయాలని అభిప్రాయపడుతున్నారు

కాగా, నిన్న జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెంట్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 210 పరుగులు చేసింది.ఈ మ్యాచ్లో రుద్రాజ్ గైక్వాడ్ సెంచరీ చేయగా శివం దూబే 66 పరుగులు చేసి రాణించాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెంట్స్ 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించింది. లక్నో ఆల్రౌండర్ మర్కస్ స్టోయిన్స్ సెంచరీ చేసి మ్యాచ్ గెలిపించాడు. దీంతో అతనికి మాన్ అఫ్ ద మ్యాచ్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news