టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపిఎల్ కి దూరం అయ్యే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ధోని వయసు దాదాపు 40 గా ఉండటం ఒక కారణం అయితే, ధోని వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు అని, అందుకే అతను ఐపిఎల్ కి దూరం అయ్యే అవకాశం ఉంది అని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. సోషల్ మీడియాలో ఈ మేరకు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ధోనీ ఇటీవల ఒక భూ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు అని అతని సన్నిహితులు ఒక మీడియా ఛానల్ కి చెప్పారు. దీనితో ధోనీ దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ సమయంలో ఈ సమస్య వచ్చింది అని, అది పరిష్కారం అయ్యే విధంగా లేదు అని కాబట్టి ఐపిఎల్ లో ధోని కొన్ని మ్యాచ్ లకు దూరం అయ్యే సూచనలు ఉన్నాయని చెప్తున్నారు.