భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి యావత్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 19.29 గంటల నుంచి తాను రిటైర్ అయినట్లు భావించాలని తెలిపాడు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. ధోనీ ఇంత సడెన్‌గా రిటైర్ ఎందుకు అయ్యాడని అభిమానులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై అనేక వార్తలు కూడా వస్తున్నాయి.
అయితే ఆయా వార్తలకు చెక్ పెడుతూ ధోనీ మేనేజర్ అసలు విషయాన్ని చెప్పేశాడు. ధోనీ మేనేజర్ మిహిర్ దివాకర్ ధోనీ అసలు ఎందుకు రిటైర్ అయ్యాడో తెలిపాడు. గత కొంత కాలంగా ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకుంటున్నాడని, ఇది సడెన్‌గా తీసుకున్న నిర్ణయం కాదని తెలిపాడు. అయితే రిటైర్మెంట్ ప్రకటించే తేదీ కోసం ధోనీ ఎదురు చూస్తున్నాడని తెలిపాడు. ధోనీ అపరిమితమైన దేశ భక్తి ఉన్నవాడు. అందుకనే స్వాతంత్య్ర దినోత్సవం రోజున రిటైర్మెంట్ ప్రకటించాడని తెలిపాడు.
కాగా ధోనీ టెస్టు క్రికెట్‌కు ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం వన్డేలు, టీ20లలో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు వాటికి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ ధోనీ నిజానికి మరో 2 ఏళ్ల వరకు ఆడుతాడని భావించారు. కానీ అతను ఇప్పుడు సడెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ ఇంకా షాక్‌కు గురి చేస్తూనే ఉంది.