టీడీపీ ప్రచారంతో వైసీపీకి భయం పట్టుకుంది: ధూళిపాళ్ల

టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధించారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్ కు గ్యారెంటీపై టీడీపీ ప్రచారంతో జగన్ అండ్ కో కు భయం పట్టుకున్నట్టుందని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టో ద్వారా ఏమేం చేస్తామో ప్రజలకు చెప్పేందుకు మేం ఊరూరా తిరుగుతుంటే వైసీపీకి వచ్చిన నొప్పేంటి? అని ధూళిపాళ్ల ప్రశ్నించారు. “ఎన్నికల హామీలపై ప్రచారం నిబంధనల ఉల్లంఘన ఎలా అవుతుంది? వైసీపీలో ఉన్న ఓటమి ఫ్రస్ట్రేషన్ అంతా ఆఫ్ నాలెడ్జ్ ఫెలో, క్యాంప్ ఆఫీసు సీనియర్ క్లర్కు సజ్జలలో కనిపిస్తోంది. మేం అధికారంలోకి రావడం ఖాయం… నువ్వు, నీ కొడుకు ఉద్యోగాలు ఊడి నిరుద్యోగులు అవ్వడం ఖాయం. టెన్షన్ వద్దు సజ్జలా… మీ అబ్బాయికి యువగళం పథకం కింద నెలకు రూ.3 వేలు ఇస్తాం. ఎలాంటి వివక్ష లేకుండా మీ కొంపకి కూడా బాబు ష్యూరిటీ పథకాలు అందిస్తాం” అంటూ ధూళిపాళ్ల నరేంద్ర వ్యంగ్యం ప్రదర్శించారు.

జగన్ దోపిడీకి అడ్డుకట్ట వేయలేని నిస్సహాయ స్థితిలో ఈ.ఆర్.సీ ఉండటం బాధాకరం:  ధూళిపాళ్ల నరేంద్రకుమార్

ఫిషింగ్ హార్బర్‌ అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్య్సకారులకు 100 శాతం నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. సోమవారం నాడు ఈ ఘటనా జరిగిన స్థలాన్ని కొల్లు రవీంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…‘‘. తీవ్ర నష్టం జరిగినా.. ప్రభుత్వ స్పందించిన తీరు బాధాకరం. తక్షణ సాయం ప్రకటించకపోవడం దారుణం. 39 బోట్లు దగ్ధం కావడం ఫిషింగ్ హార్బర్ చరిత్రలో ఎప్పుడూ లేదు. కొత్త ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తామని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఉన్న హార్బర్లకు రక్షణ ఎక్కడ ఉంది? బాధితులకు రావాల్సిన నష్టపరిహారంపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం’’ అని కొల్లు రవీంద్ర తెలిపారు.