నేషనల్ హెరాల్డ్ కేసులో రూ.751.9 కోట్ల ఆస్తులు జప్తు

-

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీని విచారించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక విషయాన్ని చెప్పింది. నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబానికి రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశామని తాజాగా ఈడీ చెప్పింది. ఈ ఆస్తులు యంగ్ ఇండియన్ షేర్‌హోల్డర్లు అయిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి చెందినవిగా పరిగణించాలని, అందువల్ల వారు పన్నులకు బాధ్యులని ఆదాయపు పన్ను శాఖ చెప్పిందని గుర్తు చేసింది ఈడీ.

Sonia, Rahul speak with Mayawati following her mother's death - The  Economic Times

దీంతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి ఏజేఎల్ సంస్ధ రూ.90 కోట్ల అప్పు చెల్లించాల్సి వచ్చింది. కానీ ఈ అప్పు చెల్లించలేని పరిస్దితిలో ఏజేఎల్ ఉందని చూపించి కాంగ్రెస్ పార్టీ దీన్ని మరో కొత్త సంస్ధ యంగ్ ఇండియాలో విలీనం చేసింది. ఇందుకు గాను 50 లక్షలు చెల్లించింది. దీంతో ఏజేఎల్ వాటాదారుల్ని కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు మోసం చేశారని కోర్టు నిర్ధారించింది. కాంగ్రెస్ పార్టీ ఏజేఎల్ ను యంగ్ ఇండియాకు ఇచ్చేశాక పాత రుణం చెల్లించాలని, లేదా ఏజేఎల్ షేర్లు కేటాయించాలని కోరింది. దీంతో ఏజేఎల్ సంస్ధ ఓ అత్యవసర సమావేశం నిర్వహించి వాటా మూలధనం పెంపుతో పాటు యంగ్ ఇండియాకు తాజాగా రూ.90.21 కోట్ల విలువైన షేర్ల జారీకి తీర్మానం చేసింది. ఈ తాజా షేర్ల కేటాయింపుతో వెయ్యి కంటే ఎక్కువ మంది వాటాదారుల వాటా కేవలం 1 శాతానికి తగ్గించారు. అలాగే ఏజేఎల్ కూడా యంగ్ ఇండియా అనుబంధ సంస్థగా మారింది. అలాగే యంగ్ ఇండియా ఏజేఎల్ ఆస్తులపై నియంత్రణ కూడా తెచ్చుకుంది. ఇందులో అక్రమాలు జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news