డైలాగ్ ఆఫ్ ద డే : తొక్కుకుంటూ పోవాలే ! ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్

-

రాజ‌కీయ పార్టీల‌లో ఇప్పుడంతా వినిపిస్తోంది ఒకే ఒక్క డైలాగ్ అదే తొక్కుకుంటూ పోవాలె..ఈ డైలాగ్ అన్న‌ది త్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఆర్ఆర్ఆర్ మూవీలో వినిపించింది.అప్ప‌టి నుంచి టీడీపీ ఎక్కువ‌గా వాడుతోంది.సినిమాలో కూడా తార‌క్ ఈ డైలాగ్ చెప్ప‌డంతో ఒక్క‌సారిగా ఈ డైలాగ్ ను వాడుకుంటున్న తీరు కూడా అటెన్ష‌న్ పాయింట్ గానే మారింది.

ఇప్ప‌టిదాకా ఉన్న రాజ‌కీయాల్లో పెను మార్పులు రావాలంటే ప్ర‌త్య‌ర్థుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించాలంటే తొక్కుకుంటూ పోవాలే అన్న అర్థం వ‌చ్చేలా ప‌సుపు పార్టీ కార్య‌క‌ర్త‌లు ఫుల్ జోష‌ల్ తో ఈ డైలాగ్ ను ప‌లుకుతున్నారు.అదేవిధంగా సోష‌ల్ మీడియాలో వాడుతున్నారు కూడా!

tdp-janasena-ysrcp

వాస్త‌వానికి తెలంగాణ‌లో త్వ‌ర‌లో యూపీలో స‌క్సెస్ అయిన బుల్డోజ‌ర్ ఫార్ములానే అప్లై చేస్తామ‌ని అంటున్నారు కొంద‌రు బీజేపీ నాయ‌కులు.ఆ విధంగా తాము కేసీఆర్ ను నిలువ‌రిస్తామ‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితికి ఉనికి అన్న‌ది లేకుండా  చేస్తామ‌ని కూడా అంటున్నారు.వాళ్ల మాట ఎలా ఉన్నా కూడా బీజేపీ సాధించాల్సింది ఎంతో ఉంది. అందుకు డైలాగులు కాదు కావాల్సింది క్షేత్ర స్థాయిలో కొట్లాట‌ల‌కు తావివ్వ‌ని నాయ‌క‌త్వం. నాయ‌క‌త్వ రీతిలో ఉంటే ఠీవి, తెలివి, స‌మ‌ర్థ‌త అన్న‌వి బీజేపీని విజ‌య తీరాల‌కు చేర్చ‌గ‌ల‌దు. అంతేకానీ మాట‌ల యుద్ధం ద్వారా ఓట్ల వేట సాధ్యం కాదు.

ఇక వైసీపీని ఉద్దేశించి టీడీపీ అంటున్న తొక్కుకుంటూ పోవాలె డైలాగ్ వినేందుకు బాగానే ఉన్నా ఇవాళ జ‌గ‌న్ ను ఢీ కొనేంత‌గా చంద్ర‌బాబు వ‌ర్గాలు ఎద‌గ‌లేక‌పోయాయి అన్న‌ది ఓ వాస్త‌వం. అదేవిధంగా వైసీపీని చాలా స్థాయిలో ఓడించ‌డం కాదు క‌దా క‌నీస స్థాయిలో పోటీ ఇచ్చే స్థితిలో కూడా చాలా చోట్ల టీడీపీ లేదు.ఇందుకు కార‌ణాలెన్నో ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో స‌మ‌ర్థ నాయ‌క‌త్వం
లేని కార‌ణంగా ఇవాళ టీడీపీ  కేవ‌లం సినిమా డైలాగులు మాత్రమే చెప్ప‌గ‌లుగుతోంది అన్న‌ది పెద్దాయ‌న నంద‌మూరి తార‌క రామారావు అభిమానుల నుంచే కాదు ఇత‌ర వ‌ర్గాల నుంచి కూడా వినిపిస్తున్న విమ‌ర్శ.

Read more RELATED
Recommended to you

Exit mobile version