ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా అనేది ఒక పెను భూతంలా మారింది. అందులో వచ్చే వార్తలను నమ్మాలో, లేదో అర్థం కావడం లేదు. చాలా వరకు వార్తల్లో నకిలీవే ఉంటున్నాయి.
ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా అనేది ఒక పెను భూతంలా మారింది. అందులో వచ్చే వార్తలను నమ్మాలో, లేదో అర్థం కావడం లేదు. చాలా వరకు వార్తల్లో నకిలీవే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరొక నకిలీ వార్త కూడా అందులో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే… కేవలం ఒకే ఒక్క పాటతో ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన రాను మొండల్ తెలుసు కదా. అయితే ఆమెకు బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ రూ.55 లక్షల విలువైన ఓ ఫ్లాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. అయితే అది కేవలం పుకారు మాత్రమేనని, అందులో నిజం లేదని వెల్లడైంది.
రాణాఘట్ రైల్వే స్టేషన్‌లో లతా మంగేష్కర్ పాడిన ఏక్ ప్యార్ కా నగ్మా హై పాటను రాను మొండల్ ఆలపించగా దాన్ని ఆమ్రా షొబై షొయ్‌టన్ క్లబ్‌కు చెందిన విక్కీ బిస్వాస్‌తోపాటు ఆ క్లబ్‌కు చెందిన మరొక సభ్యుడు రికార్డు చేశారు. అయితే వారు చెబుతున్న ప్రకారం.. సల్మాన్ రూ.55 లక్షల విలువ గల ఫ్లాట్‌ను రాను మొండల్‌కు ఇవ్వలేదని, అలాంటి సమాచారమేమీ తమకు అందలేదని, ఆయన ఇల్లు ఇచ్చినట్లుగా వస్తున్న వార్తలు నకిలీవేనని తేల్చారు.
ఇక రాను మొండల్ పాడిన గీతాన్ని రికార్డు చేసిన సంగీత దర్శకుడు హిమేష్ రేషమ్మియా ఆమెకు కొంత మొత్తంలో డబ్బును అందజేశారని, తాను కో జడ్జిగా వ్యవహరిస్తున్న సూపర్‌స్టార్ సింగర్ అనే రియాలిటీ షోలో పాల్గొనాలని హిమేష్‌కు ఆఫర్ ఇచ్చారని, ఇక ఆమెకు రాను, పోను ఖర్చులు కూడా హిమేష్ పెట్టుకుంటారని చెప్పారని.. వస్తున్న వార్తలు మాత్రం నిజమేనని అన్నారు. కానీ సల్మాన్ ఫ్లాట్ ఇచ్చాడని, మకొరు కారు ఇచ్చారని వస్తున్న వార్తలు అబద్ధమని అన్నారు. అదీ.. సోషల్ మీడియా మహిమ.. దాన్ని నమ్మితే ఇంక అంతే సంగతులు..!