ఈ తప్పుల వలనే ఎముకలు ఆరోగ్యం దెబ్బతింటుంది మీకు తెలుసా…?

-

ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. చాలా మందిలో ఎముకల సమస్యలు కూడా ఉన్నాయి. అయితే ఎముకల సమస్యలు ఉండకుండా ఉండాలంటే మంచి పోషక పదార్థాలను తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు.

 

అయితే ఎముకల ఆరోగ్యం బాగుండాలంటే క్యాల్షియం, విటమిన్ డి వంటివి ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. అయితే చాలా మంది చేసే తప్పుల వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే ఎముకల ఆరోగ్యం బాగుండాలన్నా, సమస్యలు రాకుండా ఉండాలన్నా ఈ తప్పులు మీరు చేయొద్దు. అయితే మరి ఈ ఎముకల ఆరోగ్యం ఎలా దెబ్బతింటోంది..?, దీనికి గల కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

సోడియం:

సోడియం ని ఎక్కువగా తీసుకోవడం ఒంట్లో క్యాల్షియం తగ్గిపోతుంది. ఈ కారణంగా ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. ఎముకలు బలహీనపడతాయి కూడా. కాబట్టి ఎముకల ఆరోగ్యం బాగుండాలంటే సాల్ట్ ని తగ్గించండి.

స్వీట్స్:

అధికంగా తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎక్కువ పంచదార తీసుకోవడం వల్ల పోషకాలు లోపలకి అందవు. దీంతో ఎముకలు బలహీనపడతాయి.

కెఫిన్:

కెఫీన్ తీసుకోవడం వల్ల మహిళల్లో బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఎముకల ఆరోగ్యం బాగుండాలంటే కెఫిన్ ను తగ్గించడం మంచిది.

సోడా:

ఎక్కువ సోడా తీసుకోవడం వల్ల కూడా ఎముకల కి హాని కలుగుతుంది.

చికెన్:

ఎక్కువ చికెన్ తీసుకున్నా సరే ఎముకలు బలహీనపడతాయి. జంతువుల నుంచి వచ్చే ప్రోటీన్ బ్లడ్ ని కొద్దిగా యాసిడిక్ గా మారుస్తుంది.

ఆల్కహాల్:

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఆల్కహాల్ కి కూడా దూరంగా ఉండండి ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news