జరగండి పాటకి అంత ఖర్చు పెట్టారా .. షణ్ముఖ్‌ సినిమాతో పోలుస్తూ చెర్రీ ఫ్యాన్స్ ఫైర్

-

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులు చాలాకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా భారీ బడ్జెట్తో విడుదలైన జరగండి పాట.. హైప్ క్రియోట్ చేస్తుందని అనుకున్నారు, కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ పాటకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు.

ఈ పాటకి పెట్టిన డబ్బులతో నాలుగు చిన్న చిత్రాలు తీయవచ్చని నెటిజెన్స్ సోషల్ మీడియ వేదిక గా ట్రోల్ చేస్తున్నారు. ఈ పాటను అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా, ప్రభుదేవా కొరియోగ్రాఫ్ అందించారు. ఇక ఈ సాంగ్ కోసం దాదాపు 18 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. కానీ, చెర్రీ అభిమానులు చాలా హర్ట్ అయినట్లు అర్దమవుతుంది. కాపీ కొట్టిన పాటను రామ్ చరణ్ కు ఎలా పెడతారంటూ షణ్ముఖ్‌ సినిమాతో పోల్చి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. 24 గంటల్లో ఐదు మిలియన్స్ వ్యూస్‌ మాత్రమే రాబట్టుకుంది. తెలుగు, తమిళం, హిందీలో ఈ పాటకి 5.3 మిలియన్స్ వ్యూస్‌ మాత్రమే వచ్చాయి. లైక్స్ మూడు లక్షల యాభై వేలు మాత్రమే వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news