కన్నడ దర్శకుడు హేమంత్ రాజ్ ఎంతో హృద్యంగా తెరకెక్కించిన దెసెంట్ అండ్ డిఫెరెంట్ లవ్ స్టోరీ సప్త సాగరాలు దాటి సైడ్ ఎ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని అన్ని భాషలలోనూ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇందులో హీరో హీరోయిన్ లుగా నటించిన రక్షిత్ శెట్టి మరియు రుక్మిణి వసంత్ లు ప్రాణం పెట్టి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాలో ప్రతి ఒక సీన్ ఎంతో ఎమోషనల్ గా చిత్రీకరించబడింది. ఈ సినిమా హిట్ కావడంతో సప్త సాగారాలు దాటి సైడ్ బి ని కూడా మేకర్స్ ప్లాన్ చేశారు. ఇదే నెలలో విడుదల చేయనున్న ఈ చిత్రం కోసం చాలా మంది భగ్న ప్రేమికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మొదటి పార్ట్ లోనే హీరోయిన్ కి వేరొక అబ్బాయితో పెళ్లి అయిపోతుంది, ఎవ్వరైనా అక్కడి వరకు తీయగలరు.
కానీ పెళ్లి అయిన తర్వాత హీరో తనను మర్చిపోయి మిగిలిన జీవితాన్ని ఎలా గడపాలి అన్న కతతో సమాజానికి ఒక మంచి సందేశంతో రానున్నారు హేమంత్ రాజ్. కాగా ఈ సినిమా ట్రైలర్ ను కాసేపటి క్రితమే సమంత రిలీజ్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేయండి.