దిల్ రాజు@50ఇయర్స్…గ్రాండ్ పార్టీ కి …చిరు గ్రాండ్ ఎంట్రీ …

-

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లలో దిల్ రాజు ఒకరు. ప్రొడ్యూసర్ దిల్ రాజు డిసెంబర్ 18 న 50 వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భాంగా సినీ ప్రముఖులంతా ఆయనకు బెస్ట్ విషెష్ అందజేస్తున్నారు. ‘దిల్’ సినిమాతో దిల్ రాజుగా మారిపోయిన ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వరుస విజయాలను అందుకుంటూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్నారు.

లాక్ డౌన్ సమయంలో రెండో వివాహం చేసుకున్న తర్వాత దిల్ రాజు జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు కావడంతో కుమార్తె హన్షితా రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మాజీ ఎయిర్ హోస్టెస్ వైఘారెడ్డితో కొన్నినెలల కిందట దిల్ రాజు పెళ్లి జరగ్గా, కరోనా పరిస్థితుల కారణంగా అప్పట్లో ఎవరికీ విందు ఇవ్వలేకపోయారు.అయితే నేటితో దిల్ రాజు 50 ఏళ్ళ మైలురాయిని చేరుకున్నారు.తన 50వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమార్తె హన్షితా రెడ్డి టాలీవుడ్ సినీ ప్రముఖులకు గ్రాండ్ పార్టీ ప్లాన్ చేశారు.

‘దిల్ రాజు@50ఇయర్స్’ అనే పేరుతో నిర్వహించిన ఈ పార్టీలో స్టార్స్ అందరూ సందడి చేశారు. దిల్ రాజు పుట్టినరోజు వేడుకలకి దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలు అంతా హాజరైనట్లు తెలుస్తోంది.తన 50వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమార్తె హన్షితా రెడ్డి టాలీవుడ్ సినీ ప్రముఖులకు గ్రాండ్ పార్టీ ప్లాన్ చేశారు. ‘దిల్ రాజు@50ఇయర్స్’ అనే పేరుతో నిర్వహించిన ఈ పార్టీలో చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్ బాబు, రామ్ చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్, య‌ష్‌, ప్ర‌శాంత్ నీల్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రామ్, స‌మంత‌, నాగ చైత‌న్య‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, నితిన్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. వీరంతా దిల్ రాజుకు ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు

Read more RELATED
Recommended to you

Latest news