మెగా డాటర్ నిహారికకు … భర్త చైతన్య సర్ప్రైజ్ పార్టీ …

-

డిసెంబర్ 9 రాత్రి 7 గంటల 15 నిమిషాలకు చైతన్య జొన్నలగడ్డతో మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకకు మెగా , అల్లు ఫ్యామిలీ సభ్యులంతా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రెస్పెషన్ చేసుకోగా..ఇండస్ట్రీ లోని సినీ పెద్దలు , నటి నటులు హాజరయ్యారు.

అయితే మెగా ప్రిన్సెస్ నిహారిక వెడ్డింగ్ జరిగి 10 అవుతున్న తున్న ఇంకా తన వెడ్డింగ్ కి సంభందించిన ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉన్నాయ్ .చైతన్య నిహారిక దంపతులు రీసెంట్ గానే తిరుపతి నుండి హైదరాబాద్ చేరుకున్నారు .ఒక ప్రైవేట్ పార్టీ లో కూడా పాల్గొన్నారు .ఆ పార్టీ కి బొమ్మ అదిరింది టీం లోని కొందరు హాజరయ్యారు .నిహారిక డి డిసెంబర్ 18 న పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటుంది .

ఇంటి పేరు మారాక నిహారిక జ‌రుపుకున్న తొలి బ‌ర్త్‌డే ఇది కావటం తో చై బాగానే సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది .బర్త్ డే కి ఒకరోజు ముందే హైదరాబాద్ లోని తజ్ ఫలకనామ పాలస్ కి చేరుకున్నారు ఈ కొత్త జంట . ఈ కార్య‌క్ర‌మానికి యాంక‌ర్ ర‌వి, రాఘ‌వ‌, ప‌లువురు జ‌బ‌ర్ధ‌స్త్ న‌టులు, అదిరింది న‌టులు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం నిహారిక బ‌ర్త్‌డేకి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.!

Read more RELATED
Recommended to you

Latest news