దిల్ రాజు కుటుంబం నుండి వస్తున్న హీరో..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసులకి కొదవ లేదు. ప్రస్తుతం టాప్ లో ఉన్న చాలా మందిలో ఎక్కువ మంది వారసత్వంగా వచ్చిన వారే. అయితే ఇండస్ట్రీలోకి వారసత్వంగా వచ్చినప్పటికీ సరైన సినిమాలు పడకపోతే ఎంత పెద్ద వారసత్వం ఉన్నా ప్రేక్షకులు పక్కన పెట్టేస్తారు. అదంతా అటుంచితే, తాజాగా ఇండస్ట్రీలోకి మరో కొత్త హీరో వస్తున్నాడు. ప్రఖ్యాత నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. సహ నిర్మాతగా వ్యవహరించిన శిరీష్ రెడ్డి కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా మారుతున్నాడు.

ఇప్పటికే సినిమా చిత్రీకరణ మొదలైందని టాక్ వినిపిస్తుంది. ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సాహో చిత్రానికి పనిచేసిన కెమెరామెన్ మది ఛాయాగ్రాహకుడిగా ఉన్నారు. హుషారు సినిమాతో యూత్ ఫుల్ సినిమా తీసి అందరి ప్రశంసలు అందుకున్న శ్రీ హర్ష ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.