ప్లే ఆఫ్ నుంచి డిల్లీ అవుట్.. ఇన్‌స్టాగ్రామ్ లో పంత్ ఎమోషనల్ పోస్ట్

-

ఐపీఎల్ 17వ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విఫలమైంది. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో అప్పటి వరకు ఎక్కడో ఓ చోట మిణుకుమిణుకు మంటున్న ఢిల్లీ ఫ్లేఆఫ్స్ ఆశలు గల్లంతు కావడంతో కెప్టెన్ పంత్ ఇన్‌స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘చాలా కాలం తర్వాత మైదానంలోకి దిగడం అద్భుతంగా అనిపించింది. నాకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు. నాపై అభిమానులు చూపుతున్న ప్రేమ వెలకట్టలేనిది. నేను ఇష్టపడే క్రికెట్ ఆడుతున్నందుకు థ్రిల్గా ఉంది. మున్ముందు మరిన్ని అద్భుతమైన జ్ఞాపకాలను సంపాదించుకోవాలని ఎదురుచూస్తున్నా’ అంటూ పంత్ పేర్కొన్నారు.

కాగా, ఈ సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచుల్లో విజయం సాధించింది. మరో 7 మ్యాచుల్లో ఓడిపోయింది. 14 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news