ఒడిశాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ను ఓడించేందుకు బీజేపి తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌పై విమర్శల బాణాలు సంధిస్తోంది. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒడిశాలోని రౌర్కెలాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ… ఇప్పటివరకు దేశంలో జరిగిన 4 దశల ఎన్నికల్లో బీజేపీ 270 సీట్లు ఖాయం చేసుకొని 400 దిశగా దూసుకెళ్తోందని అన్నారు. ఒడిశాలో 75 అసెంబ్లీ, 15 లోక్‌సభ సీట్లు గెలుచుకుంటామని అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు.
”ఈ ఎన్నికలు నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు, ఇండియాను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దేందుకు, దేశంలో మూడు కోట్ల మంది పేదలకు ఇళ్లు అందించేందుకు, దేశంలో మూడు కోట్ల మంది అక్కాచెల్లెళ్లను లక్షాధికారులుగా మార్చేందుకు,ఒడిశాలో నవీన్‌పట్నాయక్ ప్రభుత్వంను తొలగించి అభివృద్ధిలో నవశకానికి నాంది పలికేందుకు జరుగుతున్న ఎన్నికలు” అని అమిత్ షా వ్యాఖ్యానించారు.