సినీ నటి డింపుల్ హయాతిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ విషయంపై స్పందించిన ఆమె వరుస ట్వీట్లు చేశారు. ‘అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పుల్ని ఆపలేరు’ అని, అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా తప్పుల్ని దాచలేరని, సత్యమేవ జయతే అని మరో ట్వీట్ చేశారు నటి డింపుల్. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ విషయంపై తాను ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదన్నారు. దయచేసి సహనంతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. తన లీగల్ టీమ్ త్వరలోనే దీనికి బదులిస్తుందని పేర్కొన్నారు.
డింపుల్ ను వేధించాలనేదే డీసీపీ రాహుల్ హెగ్డే ఉద్దేశమని ఆమె అడ్వకేట్ పాల్ సత్యనారాయణ చెప్పారు. డింపుల్ తో హెగ్డే చాలాసార్లు ర్యాష్ గా మాట్లాడారన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. అపార్ట్ మెంట్లో డింపుల్ పార్కింగ్ ప్లేస్ లో కోన్స్ పెట్టారని, కోన్స్ తీయాలని చాలాసార్లు చెప్పినా డీసీపీ వినకపోవడంతో డింపుల్ కోన్స్ ని కాలుతో తన్నారని చెప్పారు. అసలు క్వార్టర్స్ లో ఉండకుండా డీసీపీ అపార్ట్ మెంట్ లో ఎందుకు ఉంటున్నారో చెప్పాలన్నారు.