వింత ఫోబియాతో భయపడుతున్న అనీల్ రావిపూడి..!!

-

గత ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ కొట్టిన‌ యువ దర్శకుడు అనిల్ రావిపూడి.. ఈ ఏడాది కూడా అదే రేంజ్‌లో దూసుకుపోతున్నారు. ఇటీవ‌ల అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు హీరో తెర‌కెక్కిన `సరిలేరు నీకెవ్వరు` ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించింది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సినిమాతో వరుసగా ఐదో విజయాన్ని పూర్తి చేశాడు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి, కొరటాల శివ తర్వాత అపజయం అంటూ లేకుండా దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి.

ఇదిలా ఉంటే.. అనిల్ రావిపూడి ఓ కార్యక్రమంలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు ఫ్లైట్ ఫోబియా ఉందని చెప్పారు. విమానం సజావుగా వెళుతుంటే తాను కూడా స్థిమితంగానే ఉంటానని, ఎక్కడైనా కుదుపు వస్తే హడలిపోతానని వివరించారు. అక్కడ్నించి తన విమాన ప్రయాణాన్ని చిత్రీకరిస్తే ఓ సినిమా అవుతుందని చమత్కరించారు. ఫ్లైట్ జ‌ర్నీ అంటే అంతగా భయపడతానని తెలిపారు.

కాగా, ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే అనిల్ రావిపూడి.. తన పని తాను చేసుకుంటూ వరుస విజయాలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో మోస్ట్‌ వాంటెడ్‌ దర్శకుల లిస్టులో ఈయ‌న కూడా చేరారు. ఏ కాన్సెప్ట్ ను అయినా.. కమర్షియల్ ఎలెమెంట్స్ మిక్స్ చేసి ఎంటర్టైనింగ్ గా చెప్పడం అనిల్ రావిపూడి స్పెషాలిటీ. ఇప్పటి వరకూ అనిల్ డైరెక్ట్ చేసిన ప్రతీ హీరోకి కెరీర్ బెస్ట్ మూవీ ఇచ్చాడు అన‌డంతో ఏ మాత్రం సందేహాం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news