అదిరిపోయిన కొడాక్ 4కె ఆండ్రాయిడ్ టీవీలు.. ధ‌ర ఎంతంటే..?

-

ప్ర‌ముఖ కెమెరాల త‌యారీదారు కొడాక్ భార‌త్‌లో సీఏ సిరీస్‌లో ప‌లు నూత‌న 4కె ఆండ్రాయిడ్ టీవీల‌ను లాంచ్ చేసింది. సోమ‌వారం ఈ టీవీల‌ను కొడాక్ భార‌త మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. ఈ టీవీలు 43, 50, 55, 65 ఇంచుల సైజుల్లో వినియోగదారుల‌కు ల‌భిస్తున్నాయి. వీటిల్లో 4కె రిజల్యూష‌న్‌ను అందిస్తున్నారు.

kodak launched 4k android tvs in india

కొడాక్ నూత‌న ఆండ్రాయిడ్ టీవీల‌లో డాల్బీ విజ‌న్‌, హెచ్‌డీఆర్‌10, హెచ్ఎల్‌జీ స‌పోర్ట్‌, ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్‌, గూగుల్ అసిస్టెంట్‌కు స‌పోర్ట్‌, బిల్టిన్ క్రోమ్‌క్యాస్ట్‌, బెజెల్ లెస్ డిజైన్ వంటి ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. వీటిల్లో మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 1.75 జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌, వైఫై, బ్లూటూత్ 5.0, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ, ఈథ‌ర్‌నెట్‌, ఆక్స్ పోర్ట్‌, నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, గూగుల్ ప్లే ఇన్‌బిల్ట్ యాప్స్‌, డాల్బీ ఆడియో, డీటీఎస్ సరౌండ్ సౌంట్ ఫీచ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు.

ఇక కొడాక్ సీఏ టీవీల‌లో 43 ఇంచుల మోడ‌ల్ ధ‌ర రూ.23,999 ఉండ‌గా, 50 ఇంచుల మోడ‌ల్ ధ‌ర రూ.27,999గా ఉంది. అలాగే 55 ఇంచుల టీవీ ధ‌ర రూ.30,999 ఉండ‌గా, 65 ఇంచుల టాప్ ఎండ్ టీవీ ధ‌ర రూ.49,999 గా ఉంది. వీటిని మార్చి 19వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news