“ఉస్తాద్ భగత్ సింగ్” పై స్ట్రాంగ్ కామెంట్ చేసిన హరీష్ శంకర్…!

-

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల చిత్రీకరణలో చాలా బిజీ గా ఉన్నారు. ఒకవైపు రాజకీయాలు చూసుకుంటూనే మరోవైపు సినిమాల షూటింగ్ లను మానేజ్ చేస్తున్నాడు. ఇక నిన్న విజయదశమి మరియు దసరా కానుకగా ప్రేక్షకుల కోసం పవన్ నటించిన సినిమాల అప్డేట్స్ ను విడుదల చేసిన సంగతి తెలిసందే. ఇందులో భాగంగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పోలీస్ బ్యాక్ డ్రాప్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్… ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేయగా, దీనిపై ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు డైరెక్టర్ హరీష్ శంకర్ రెస్పాండ్ అయ్యారు. ఒక నెటిజన్ ఈ సినిమాను కేవలం పవన్ కళ్యాణ్ ను చూడడానికి తీస్తున్నారా అని అడుగగా.. ఈ సినిమా పవన్ ను చూడడానికి తీయడం లేదని, పవన్ ను పూర్తిగా చూపించడానికి తీస్తున్నామని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు హరీష్ శంకర్.

ఇక ఇందులో పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా నుండి మరికొన్ని అప్డేట్స్ వస్తాయని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news