లైంగిక వేధింపులు.. డైరెక్ట‌ర్ శంక‌ర్ అల్లుడు అరెస్ట్‌

-

ఈ మధ్యకాలంలో మహిళలపై లైంగిక వేధింపులు విపరీతంగా పెరిగిపోయారు. మామూలు ఆకతాయిలు కాకుండా సెలబ్రిటీలు కూడా ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. అయితే తాజాగా ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు కేసులో.. స్టార్ డైరెక్టర్ శంకర్ అల్లుడు రోహిత్ దామోదరన్ అరెస్ట్ అయ్యాడు. అతనితోపాటు మరో ఐదుగురిని మంగళవారం పుదుచ్చేరి లో పోలీసులు అరెస్టు చేశారు. 16 సంవత్సరాల అమ్మాయిని లైంగికంగా వేధించారు అన్న ఆరోపణలు వీళ్లపై ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే బాధితురాలి ఫిర్యాదు మేరకు… ఈ రోహిత్ గ్యాంగ్ పై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ ఏడాది జూన్ మాసంలో శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు క్రికెటర్ రోహిత్ దామోదరన్. రోహిత్ ఓ క్రికెట్ క్లబ్ కెప్టెన్గా కూడా పనిచేశాడు.

రోహిత్ తండ్రి దామోదరన్ , క్రికెట్ కోచ్ థమరై కన్నన్ తో పాటు మరో ఇద్దరు పైన పుదుచ్చేరిలోని మోట్టు పాలయం పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. తాను క్రికెట్ కోచింగ్ కోసం వెళ్లిన సమయంలో వీలు తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. ఈ వేధింపులపై ఎవరికీ చెప్పొద్దు అని కూడా బెదిరించారని తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే వీరందరినీ తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news