రైతులకు జగన్ శుభవార్త : 26వ తేదీ నుంచే రైతు భరోసా రెండో విడత డబ్బులు

-

ఏపీ సిఎం జగన్.. రైతులకు తీపి కబురు చెప్పారు. అక్టోబరు 26 న రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. స్పందనపై సీఎం వైయస్‌.జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 2020 ఖరీఫ్‌ కు సంబంధించిన సున్నా వడ్డీ పంట రుణాలు అందిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమాల అమలుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని.. నవంబర్‌లో విద్యా దీవెనకు సంబంధించి కూడా వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 10 రోజుల ఆసరా కార్యక్రమాలను నిర్వహించిన కలెక్టర్లు, అధికారులందరికీ అభినందనలు తెలిపారు సిఎం జగన్.

అలాగే ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని.. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురంజిల్లాల్లో మెటీరియల్‌ కాంపొనెంట్‌ వినియోగంపై తగిన దృష్టి పెట్టాలని పిలుపు ఇచ్చారు. కృష్ణా, తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాలు గ్రామ సచివాలయాల నిర్మాణాల విషయంలో వెనకబడి ఉన్నారని పేర్కొన్నారు. వెంటనే సచివాలయాల భవనాలను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని.. రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి భవనాలను కూడా పూర్తి చేయాలని ఆదేశించారు సిఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news