దిక్కుతోచని స్థితిలో వున్న హిట్ కొట్టిన డైరెక్టర్..!!

-

సినిమా పరిశ్రమలో పని చేసే వారికి టాలెంట్ తో పాటు అదృష్టం కూడా వుండాలి. వీటితో పాటు ముందు చూపు చొరవ వుండడం చాలా అవసరం. ఎందుకంటే ఒక సినిమా సెట్స్ మీద వుండగానే ఇంకో సినిమా సెట్ చేసుకొని రెడీ గా వుండాలి. లేకుంటే ఇంకో సినిమా చేయటానికి చాలా గ్యాప్ వస్తుంది. ఆ డైరెక్టర్ ఎంత పెద్ద హిట్ ఇచ్చినా కూడా చివరికి హిట్ వేడి వెంటనే చల్లారి పోతుంది. అందుకే మన స్టార్ హీరోలు, డైరెక్టర్ లు వరసగా సినిమాలు ఒప్పుకుంటూ కనీసం రెండు సంవత్సారాల వరకు తిరుగులేకుండా చూసుకుంటారు.

కాని ప్రస్తుతం టాలీవుడ్లో ఒక డైరెక్టర్ పరిస్థితి చాలా ఇబ్బంది కరంగా వుంది. ఆ దర్శకుడే ఛలో’ ‘భీష్మ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల. ‘భీష్మ ‘సినిమా విడుదల అయ్యి రెండున్నర సంవత్సరాలు అయింది.కాని ఇప్పటి వరకు తన కొత్త సినిమా అప్డేట్ లేదంటే చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. గీత గోవిందంతో హిట్ కొట్టిన పరశురాం నెక్ట్స్  మహేష్ బాబుతో సినిమా సెట్ చేసుకొని హిట్ కొట్టాడు. కాని వెంకీకి హీరోలను బుట్టలో వేసుకునే తెలిటేటలు రాలేదు.

గతంలో తాను చిరంజీవికి కథ చెప్పి ఓకే అనిపించుకున్నాడని, ఇక షూటింగు మొదలు పెట్టడమే తరువాయి అనే వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు సినిమా గురించి చిరంజీవి కూడా మాట్లాడటం లేదు. ఇప్పుడు తన పరిస్థితి నాలుగు రోడ్ల చౌరస్తా దగ్గర ఉన్న మాదిరిగా తయారు అయ్యింది. ఎందుకంటే హీరోలు అందరూ చాలా బిజీగా ఉన్నారు .వెంకీ కి తర్వాత సినిమా ఎవరితో చేయాలో అర్థం కాక మళ్లీ నితిన్ తోనే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం వస్తోంది. అలాగే ఇంకో ఇద్దరు మీడియం రేంజ్ హీరోలకు కూడా కథలు వినిపిస్తున్నాడట. అందుకే అంటారు సినిమా ఫీల్డ్ లో టాలెంట్ కంటే లౌక్యం ఎక్కువగా వుండాలని. తన ప్రయత్నాలు ఫలించి మంచి సినిమా చేయాలని మనసారా కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version