డిస్క‌ష‌న్ పాయింట్ : టీడీపీ ప‌ట్టాభి ప్రేమ‌లో జ‌గ‌న్ ? ఎందుకో తెలుసా !

-

ప్ర‌జ‌ల‌కు సంబంధించి వైసీపీ ప్రేమ వేరు టీడీపీ ప్రేమ వేరు. డ‌బ్బులు మాత్ర‌మే ఇచ్చి ప్రేమ పొందాల‌ని వైసీపీ, ప‌థ‌కాల‌తో పాటు ప్రచారం కూడా బాగుంటేనే ప్రేమ వ‌స్తుంద‌ని టీడీపీ ఎప్ప‌టి నుంచో త‌మ త‌మ స్థాయిల‌లో రాజ‌కీయం చేస్తూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఒకదానిపై ఒక‌టి పై చేయి సాధిస్తున్నాయి. కొన్ని సార్లు గెలుపు ఓట‌ములకు అతీతంగా కూడా కొన్ని చోట్ల ఆ రెండు పార్టీలూ మంచి పేరే తెచ్చుకుంటున్నాయి.

andhr

విప‌క్ష హోదాలో ఇవాళ టీడీపీ ఉన్నా కొన్ని చోట్ల చంద్ర‌బాబు హ‌వా చెల్లుతుంది. కాద‌న‌లేం కూడా ! అదేవిధంగా ఆ రోజు టీడీపీ హ‌యాంలోకూడా చాలా చోట్ల వైసీపీ హ‌వా చెల్లింది కూడా! అంటే ఆ రెండు పార్టీలూ ఎప్పుడూ ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న‌తోనే ఉన్నాయి అని నిరూపించేందుకు ఈ కొద్దిపాటి ఘ‌ట‌న‌లు చాలు అని చాలా మంది ఇప్ప‌టికీ అంటుంటారు.

తాజాగా నాటు సారా వ్య‌వ‌హారం పై అటు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోనూ ఇటు యావ‌త్ ఆంధ్రాలోనూ వివాదాలు రేగుతూనే ఉన్నాయి. టీడీపీ ప‌ట్టాభి చెప్ప‌గానే స్పందించ‌డ‌మో లేదా లోకేశ్ చెప్ప‌గానే స్పందించ‌డ‌మో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి చాలా అల‌వాటులో ఉన్న ప‌ని! ఆ విధంగా ఈ సారి కూడా టీడీపీ నాయ‌కులు చెప్ప‌గానే వైసీపీ ఉరుకులు ప‌రుగులుతీసి స‌మ‌స్య ప‌రిష్క‌రించిన దాఖ‌లాలు ఉన్నాయి.

అదేవిధంగా నాటు సారా ఊట‌ల‌పై దాడులు చేసి వ‌రుస కేసులు న‌మోదు చేసిన ఘ‌ట‌న‌లు ఇవాళ ప్ర‌ధాన మీడియాలో హైలెట్ అయ్యాయి.అంటే టీడీపీ ఏం చెబితే అది చేసేందుకు ఆరోప‌ణ‌ల్లో నిజాలు ఉంటే వెంట‌వెంట‌నే చ‌ర్య‌లు తీసుకునేందుకు వైసీపీ సిద్ధంగానే ఉంది. అందుకే త‌ణుకు ఎమ్మెల్యే పై వ‌చ్చిన అవినీతి ఆరోప‌ణ‌ల (మూడు వంద‌ల కోట్లకు పైగా అవినీతి ఆయ‌నిది అన్న‌ది టీడీపీ ఆరోప‌ణ‌)పై కూడా వైసీపీ స్పందించింది.ఇప్ప‌టికే త‌ణుకు మున్సిపాల్టీలో ఎమ్మెల్యే చేసిన అవినీతిపై అక్క‌డి అధికారుల‌ను ఈ ఘ‌ట‌నకు సంబంధించి తొలి ద‌శ‌లో తీసుకుంటున్న‌చ‌ర్య‌ల్లో భాగంగా స‌స్పెండ్ చేసింది. మ‌లి ద‌శ‌లో ఎమ్మెల్యే పై కూడా చ‌ర్య‌లు ఉంటాయి.అంటే ఇక్క‌డ కూడా టీడీపీఆరోప‌ణ‌ల‌కు వైసీపీ అగ్ర‌తాంబూలం ఇచ్చింద‌న్న‌ది ఓ వాస్త‌వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version