కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దగ్గరకు వెళ్తున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను అడ్డుకున్న పోలీసులు ఆమె అక్కడికి వెళ్ళడానికి అనుమతులు లేవంటూ అరెస్ట్ చేశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పరిశీనలకు బయల్దేరిన డీకే.అరుణను ముందుగా పెబ్బేరు చౌరస్తాలో అడ్డుకున్నారు పోలీసులు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో డీకే అరుణ, బీజేపీ నాయకులు కాలినడకన బయలుదేరారు. అయినా నడిచి కూడా వెళ్ళవద్దంటూ పోలీసులు అడ్డం పడ్డారు.
తామెందుకు వెళ్లకూడదో చెప్పాలని పోలీసులను డీకే అరుణ నిలదీశారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఉదయం ప్రాజెక్టుని సందర్శించడానికి వెళ్తున్నా కాంగ్రెస్ నేతల్ని సైతం అరెస్ట్ చేశారు పోలీసులు. వాళ్లందర్నీ ఉప్పునూతల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సర్జిపూల్ గోడ కూలడంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి చెందిన 5 మోటార్లు నీట మునిగాయి. దీంతో ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లిన కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అడ్‌డుకున్నారు.