ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేసారు. ఉపాధి హామీ కూలీలపై జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు ఆయన. ఉపాధి హామీ పథకం వ్యవసాయ రంగానికి పెనుముప్పు గా మారిందని మంత్రి కృష్ణదాసు ఆరోపణలు చేసారు.
ఉపాధి హామీ కి వెళ్లి 2, 3 గంటలు కాలక్షేపం చేస్తే సరిపోతుంది అని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ పనులకు వెళ్తే 6 గంటలు కష్టపడాలన్న డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై దుమారం రేగుతుంది. కృష్ణదాసు వ్యాఖ్యలపై వ్యవసాయ కార్మిక సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడ నిరసనకు కూడా నేతలు దిగారు. కృష్ణదాసు ను మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ వ్యవసాయ కార్మిక సంఘం నిరసన చేపట్టింది.