కెసిఆర్ పెన్షన్ పేరుతో 2 వేలు ఇస్తూ.. ఒక్కో కుటుంబం నుండి 9 వేలు గుంజుతున్నాడు: డీకే అరుణ

-

ప్రజాగోస – బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కె టి దొడ్డి మండలం కొండాపురం, ఇర్కిచెడు మరియు ఇర్కిచెడు తాండ, పాగుంట, వెంకటపురం, ముసల్ దొడ్డి గ్రామాల్లో నిర్వహించిన బైక్ ర్యాలీ లో పాల్గొని గ్రామాల్లో బిజెపి జెండా ఆవిష్కరించారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కెసిఆర్ పెన్షన్ పేరుతో 2 వేలు ఇస్తూ, ఒక్కో కుటుంబం నుండి 9 వేలు గుంజుతున్నాడని ఆరోపించారు.

కెసిఆర్ కరెంటు చార్జీలు ,బస్ చార్జీలు, నిత్యవసర సరుకులు మరియు రిజిష్ట్రేషన్ ఛార్జీలు పెంచి ఇలా అనేక రకాలుగా సామాన్య ప్రజల నడ్డి విరిచాడని మండిపడ్డారు. టిఆర్ఎస్ తెరాస ప్రభుత్వం లక్షకు పైగా పెన్షన్లు తీసివేస్తుందని, బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులందరికీ పెన్షన్ అందజేస్తామన్నారు. కెసిఆర్ డబుల్ బెడ్ రూంలు ఇస్తామని, ఖాళీ స్థలం ఉంటే 5లక్షలు ఇస్తామని మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తానని హామీ ఇచ్చి తొమ్మిదేళ్లయిన ఇంతవరకు చేర్చలేదన్నారు. వచ్చే ఏడాది నుండి ఉచిత ఎరువులు ఇస్తానని కెసిఆర్ చెప్పి 5 ఏళ్లు దాటినా, ఇప్పటికీ జాడ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యంలో 28 రూలు భరిస్తూ, కరోనా లాక్ డౌన్ నుండి ప్రతి నెల 5 కిలోలు ఉచితం బియ్యం ఇస్తుందన్నారు. గతంలో గ్రామాల్లో తాను వేసిన రోడ్లే తప్పా ఇంతవరకు గ్రామాల్లో తట్టెడు మట్టి వేయలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version