కేటీఆర్ నీకు మీ అయ్యకు మాటలు ఉన్నాయా, లేవా? : డీకే అరుణ

-

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేస్తున్న రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర 27 వ రోజు, కేశంపేట మండల కేంద్రంలోని బహిరంగ సభలో ప్రసంగించారు డీకే అరుణ. జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదం తో ప్రారంభమైన పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందన్నారు. గ్రామ గ్రామాన ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ పాదయాత్రకు మద్దతు ఇస్తున్నారని అన్నారు అరుణ. తెలంగాణ లో కెసిఆర్ నియంత పాలన కొనసాగుతోందన్నారు. కెసిఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు అని ఆరోపించారు. 57 ఏళ్లు నిండిన వాళ్ళకి వెంటనే పెన్షన్ ఇచ్చి.. నీ మాట నిలబెట్టుకో కేసీఆర్ అని గుర్తు చేశారు.

డబల్ బెడ్రూమ్ ఇల్లు, దళితులకు 3 ఎకరాల భూమి, కొత్త రేషన్ కార్డులు, మహిళా సంఘాలకు పది లక్షల రుణం ఏమైంది అంటూ నిలదీశారు. మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన నాలుగువేల కోట్ల బకాయిలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు డీకే అరుణ. పెళ్లి అయిపోయి నెలలు దాటినా కల్యాణ లక్ష్మి చెక్కులు అందడం లేదు అంటూ విమర్శించారు. నిన్న నారాయణపేటలో ముఖ్యమంత్రి కొడుకు గప్పాలు, జూట మాటలు చెప్పుకుంటున్నాడు అని, కృష్ణా జలాల్లో మీ అయ్యా 575 టీఎంసీలకు కాకుండా 299 టీఎంసీలకు ఒప్పుకున్నాడని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ను ఆపిందే మీ అయ్యా అంటూ కేసీఆర్ ని ఉద్దేశించి విమర్శించారు డి.కె.అరుణ. పోయి మీ అయ్యని అడుగు నువ్వు నీ అయ్యా కృష్ణాజలాలను ఏపీకి తాకట్టు పెట్టారు అని అన్నారు. అసలు నీకు మీ అయ్యకు మాటలు ఉన్నాయా, లేవా? అంటూ ప్రశ్నించారు డీకే అరుణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version